క్రైమ్/లీగల్

వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, అగస్టు 27:వేర్వేరు సంఘటనలో ఇద్దరు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. చేవెళ్ల మండల పరిధిలోని దామరగిద్ద గ్రామానికి చెందిన బిచయ్య (65) సోమవారం సాయంత్రం టీవి ఎస్ మోటర్ సైకిల్ పైన చేవెళ్లకు వస్తుండగా రోడ్డు ప్రక్కన గడ్డి మేస్తున్న గుర్రం అకస్మికంగా రోడ్డు పైకి రావడంతో టీవీ ఎస్ మోటర్ సైకిల్ పై వస్తున్న వ్యక్తికి తగలడంతో బిచయ్య కింద పడి తలకు గాయాలైనవి, అక్కడ ఉన్న వారు 108 సహాయంతో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు చేవెళ్ల పోలీసులు తెలిపారు.
షాబాద్ మండల పరిధిలోని చందనవెళ్లి గ్రామానికి చెందిన యాదయ్య(56) తన పొలంలో ఉన్న మొక్క జొన్న పంటలో గడ్డి తీస్తుండగా గుర్తు తెలియాని విషసూరితమైన పాము సోమవారం సాయంత్రం కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు 108 సహాయంతో ఉస్మానియాకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.