క్రైమ్/లీగల్

అనుమానాస్పద స్థితిలో చీరల వ్యాపారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలానగర్, ఆగస్టు 27: అనుమానాస్పద స్ధితిలో ఓ చీరల వ్యాపారి మృతి చెందిన సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వహీద్ వుద్దిన్ కథనం ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన బ్రహ్మచారి (42) గౌతమ్‌నగర్‌లో మహమ్మద్ ఇసాక్ ఇంటిలో గదిని అద్దెకు తీసుకుని చీరల వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం బ్రహ్మచారి గది నుంచి దుర్వాసన రావడంతో మరో గదిలో ఉన్న వ్యక్తి ఇంటి యజమానికి తెలియజేశారు. తలుపులు తెరిచి చూడగా అతను మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమచారం అందించారు. సమాచారం అందుకున్న బాలానగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు గదిలో పరిశీలించగా ఆధార్ కార్డు లభించింది.పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించి దర్యాప్తు చేపట్టారు.