క్రైమ్/లీగల్

వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలానగర్, ఆగస్టు 27: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వాహీద్ వుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం గిరినగర్‌లో నివాసం ఉంటున్న యాదయ్య రెండో కుమారుడు నర్సింగ్‌రావు (36) భార్య లావణ్యతో ఉంటున్నాడు. ఇటీవల రాఖీ పౌర్ణమి సందర్భంగా భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్లారు. సోమవారం తిరిగి గిరినగర్‌కు వచ్చారు. బట్టల షాపులో పని చేస్తున్న నర్సింగ్‌రావు కొంత కాలం నుంచి పని మానేసి ఖాళీగా ఉంటున్నాడు. దీంతో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో మంగళవారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పక్క ఇంట్లో నుంచి వచ్చిన భార్య లావణ్య ఎంత కొట్టినా తలుపు తీయకపోవడంతో చుట్టు పక్కల వారి సహయంతో తలుపులు తీసి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. లావణ్య అతని తండ్రి యాదయ్యకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ రమేష్ కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.