క్రైమ్/లీగల్

బ్యాంక్ మేనేజర్‌కి బురిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఆగస్టు 27: ఉద్యోగాలు.. లాటరీలు.. బహుమతుల పేరుతో బురిడీ కొట్టించి అందినంత దండుకొనే సైబర్ నేరస్థులు కొత్త పద్ధతిలో మోసాలకు తెరలేపుతున్నారు. బ్యాంకులో కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తామని నమ్మించి బ్యాంక్ అధికారులను మోసం చేస్తున్నారు. తాజాగా నగరంలో మంచి పేరున్న ఆటోమొబైల్ షోరూమ్ యజమానినని బ్యాంకులో అధిక మొత్తంలో డిపాజిట్ చేస్తానని చెప్పి రూ.8లక్షల 20వేలు స్వాహా చేసిన సైబర్ నేరస్థులను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి రూ.3లక్షల నగదుతో పాటు వోక్ స వ్యాగన్ కారు, 7 మొబైల్ ఫోన్లు, చెక్ బుక్‌లు, ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్ బుక్కులు స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్‌కు చెందిన అరుణ్ కుమార్ (30) లోకేష్ తోమర్ (33) మోహిత్ కుమార్ (28) మనోజ్ కుమార్ (35)లు ముఠాగా ఏర్పాడి నేరాలకు పాల్పడుతున్నట్లు సీపీ తెలిపారు. తమకు నగరంలో పెద్ద కార్ట షోరూమ్ ఉందని ఈమధ్య కాలంలో వ్యాపారం బాగా జరిగిందని బ్యాంకులో అధిక మొత్తంలో డిపాజిట్ చేయాలని అనుకుంటున్నట్లు నమ్మించి ముందు కొంత డబ్బు సెక్యూరిటీ డిపాజిట్ కింద తమ ఖాతాలో జమచేయాలని నమ్మించారు. కోట్లల్లో డిపాజిట్లు వస్తున్నాయని నమ్మిన సదరు బ్యాంకు మేనేజర్ నిందితులు చూపించిన ఖాతాకు 8లక్షల 20 వేల రూపాయలు ఆర్‌టీజీఎస్ చేశారు. కొంత సమయం తరువాత ఆలోచించి నిందితుడు చేసిన ఫోన్ నెంబర్ ఇతర వివరాలు తెలుసుకుని మోస పోయినట్లు గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సజ్జనార్ తెలిపారు. ముఠాలో అరుణ్ కుమార్ గతంలో ఇలాంటి నేరంలో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలులో ఉన్న సమయంలో అరుణ్‌కు మనోజ్ పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత మోహిత్ కుమార్, లోకేష్ తోమర్‌తో కలసి ముఠాను ఏర్పాటు చేసి మోసాలు చేస్తున్నట్లు సీపీ వివరించారు. లోకేష్ నగరంలో ఉన్న పేరు మోసిన ఆటో మోబైల్ షాపుల వివరాలను సేకరించడంతో పాటు బ్యాంకు నెంబర్లను సేకరిస్తాడని తెలిపారు. 20 శాతం కమిషన్‌కు మోహిత్ కుమార్ నకిలీ బ్యాంకు ఖాతాలను తేరుస్తాడని చెప్పారు. నిందితులు దేశవ్యాప్తంగా అనేక మందిని మోసం చేసినట్లు సజ్జనార్ తెలిపారు. ఇలాంటి నేరస్థుల పట్ల బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సరైన సమాచారం లేకుండా డబ్బులు బదిలీ చేయొద్దని సూచించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైం సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు విజయవర్ధన్, రాజేందర్, నందులను అభినందించారు. క్రైం డీసీపీ ప్రియదర్శిని, ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ పాల్గొన్నారు.
చిత్రం...నేరస్థులను అరెస్టు చేసిన పోలీసులకు రివార్డు అందిస్తున్న సీపీ