క్రైమ్/లీగల్

హవాలా రాకెట్ గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: అక్రమంగా హవాలా సొమ్మును తరలిస్తున్న ముఠాను హైదరాబాద్ నగర పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఏడుగురు సభ్యులు కలిగిన ఈ ముఠాను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు వారి వద్ద నుండి రూ. 5కోట్లు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బషీర్‌బాగ్‌లో జరిగిన నగర పోలీస్ కమిషనరేట్‌లో హవాలా రాకెట్ కేసుకు సంబంధించిన వివరాలు కమిషనర్ అంజనీ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అహ్మదాబాద్‌కు చెందిన హర్షద్ బాయ్ పటేల్, ఉమేష్‌లు అహ్మద్‌బాద్, సూరత్, ముంబాయి పి.ఉమేష్ చంద్ర అండ్ కంపేనిని నడుపుతున్నారు. బంజారాహిల్స్‌లోని ఉమేష్ చంద్ర అండ్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న విపుల్ కుమార్ పాటేల్ (39) హైదర్‌గూడలోని ఆర్‌కేఎస్ ఆపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. గుజరాత్‌కు చెందిన విపుల్ కుమార్ పటేల్ గత కొంతకాలంగా హైదరాబాద్ కేంద్రంగా నగదు బదిలి వ్యాపారంను అక్రమంగా కొనసాగిస్తున్నాడు. అధిక వడ్డీలకు నగదును బదిలీ చేస్తూ వ్యాపారం సాగిస్తున్నాడు. విపుల్ కుమార్ పటేల్ కొంత మందిని కంపెనీలో ఉద్యోగులగా నియమించుకుని ఈ వ్యాపారం సాగిస్తున్నాడు. నగర టాస్క్ ఫోర్స్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అనుమానం మేరకు సోమవారం రాత్రి 11.00 గంటల ప్రాంతంలో కారును సోదా చేయగా అసలు విషయం బయటపడింది. కారులో తరలిస్తున్న ఏలాంటి అధారాలు లేని రూ.5కోట్ల నగదుతో పాటు రెండు కార్లు, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులు కంపెనీలో డ్రైవర్‌లతో పాటు ఉద్యోగులుగా పనిచేస్తున్న పటేల్ చెతన్ కుమార్, ఉపేందర్ కుమార్ పటేల్, రాజేష్ రమేష్‌బాయ్ పటేల్, అర్జున్ లాబుజీ, విపుల్ కుమార్ పటేల్, శైలేష్ బాయ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో టాస్క్ఫోర్స్ డీసీపీ పి.రాధకిషన్ రావుతదితరులు పాల్గొన్నారు.
చిత్రం...హవాలా రాకెట్ నుంచి స్వాధీనం చేసుకున్న నగదు వివరాలను వెల్లడిస్తున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్