క్రైమ్/లీగల్

గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఆర్మీ జవాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎటపాక, ఆగస్టు 27: రాష్ట్ర సరిహద్దులు దాటివచ్చి కారులో గంజాయిని తరలిస్తూ ఓ ఆర్మీ జవాన్ ఎటపాక పోలీసులకు పట్టుబడ్డాడు. సీఐ అనీష్ తెలిపిన వివరాల ప్రకారం... సీలేరు ప్రాంతం నుండి గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండల పరిధిలోని నవోదయ విద్యాలయం ఎదురుగా ఉన్న రహదారి నుండి అనుమానాస్పదంగా వస్తున్న కారును సోదా చేయగా 4 బస్తాల్లో 120 కేజీల గంజాయిని కనుగొన్నారు. కారులోని వ్యక్తిని అదుపులోకి తీసుకుని కారును, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే గంజాయి తరలిస్తున్న యువకుడు తెలంగాణా రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లా తామ్సా మండలం ధానుర గ్రామానికి చెందిన సుద్దాల కిషోర్ (26)గా గుర్తించారు. కిషోర్ ఉత్తర ప్రదేశ్‌లోని 56 ఆర్మ్‌డ్ రెజిమెంట్‌లో జవానుగా విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రెవిన్యూ అధికారులతో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి, జవాన్‌ను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐలు చినబాబు, సాగర్ తెలిపారు.