క్రైమ్/లీగల్

మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, ఆగస్టు 27: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లిలో భూవివాదానికి సంబంధించిన కేసులో మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై న్యాయస్థానం అదేశాల మేరకు మంగళవారం వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఇడిమేపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 2.40 ఎకరాల తన భూమిపై ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి మరొకరికి రిజిస్ట్రేషన్ చేశారని 2017 ఏప్రిల్ 6న వేలూరు రంగారెడ్డి అనే వ్యక్తి మాజీమంత్రి సోమిరెడ్డిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సోమిరెడ్డితోపాటు భూమి కొనుగోలు చేసిన మేఘనాథన్, జయంతి, అప్పటి వెంకటాచలం సర్వేయర్‌పై న్యాయస్థానం అదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు వెంకటాచలం ఎస్సై కరీముల్లా తెలిపారు.