క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో రెవెన్యూ ఉద్యోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఆగస్టు 27: అవినీతి నిరోధకశాఖ వలలో మరో అవినీతి అధికారి చిక్కాడు. వారం రోజుల క్రితమే మత్స్యశాఖకు చెందిన ఇద్దరు అధికారులు పట్టుబడగా వారం గడవకముందే మరో ఉద్యోగి పట్టుబడడం జిల్లాలో అవినీతి పెచ్చుమీరిందనడానికి ఉదహరణగా నిలుస్తుంది. మల్యాల మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మీర్జాపర్వెజ్‌బేగ్ రాంపూర్ గ్రామానికి చెందిన కోల రాజయ్య వద్ద నుంచి పహాణీ కోసం రూ.2వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో సీఐలు సంజీవ్, రాము, వేణులు పట్టుకున్నారు. 35సంవత్సరాలకు సంబంధించిన పహాణీల కోసం గత ఏడాది జూలైలో మల్యాల తహసీల్ కార్యాలయంలో కోల రాజయ్య దరఖాస్తు చేసుకున్నారు. పహాణీలు ఇవ్వడానికి ఏడాదికి పైగా తిప్పుకుంటుండటంతో రాజయ్య విసిగివేసారిపోయాడు. రాజయ్యకు పహాణీ ఇవ్వడానికి రెవెన్యూ ఉద్యోగి పర్వేజ్‌బేగ్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. రూ.3వేలు ఇస్తే కాని సర్ట్ఫికేట్‌లు ఇచ్చేది లేదని తెగేసి చెప్పాడు. దీంతో ఈ నెల 3న రూ.1వెయి ఇవ్వగా మంగళవారం మిగితా రూ.2వేలను జూనియర్ అసిస్టెంట్‌కు ఇస్తానని చెప్పి సదరు విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలిపాడు. దీంతో పకడ్బందీ పథకం ప్రకారం లంఛం తీసుకుంటుండగా పర్వేజ్‌బేగ్‌ను ఏసీబీ అదికారులు పట్టుకున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పంచనామ నిర్వహించిన ఏసీబీ అధికారులు రెవెన్యూ ఉద్యోగిని ఆరెస్టు చేసి కోర్టులో హజరు పరచడానికి కరీంనగర్ తీసుకొని వెళ్లారు.

చిత్రం...పట్టుబడిన రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ మీర్జాపర్వెజ్ బేగ్