క్రైమ్/లీగల్

చిదంబరానికి ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆయనను గురువారం వరకు అరెస్టు చేయడానికి వీల్లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తులు భానుమతి, కేఎస్ బొపన్నతో కూడిన సుప్రీం ధర్మాసనం బుధవారం ఈ కేసుపై వాదనలను విన్నది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపిస్తూ చిదంబరంపై ఎవరూ అసత్య ఆరోపణలు చేయలేదని స్పష్టం చేశారు. ఈ కేసును ఒక మంత్రదండంలా కొంతమంది వాడుకుంటున్నారని చిదంబరం తరఫున వాదిస్తున్న లాయర్లు చేసిన వాదనలో ఏమాత్రం పస లేదని ఆయన స్పష్టం చేశారు. మనీ లాండరింగ్ చాలా తీవ్రమైన నేరమని, చిదంబరం పాత్రపై తమ వద్ద తగినన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని బెంచ్‌కి మెహతా తెలిపారు. అనంతరం ఈ కేసును గురువారం నాటికి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. అప్పటివరకు చిదంబరాన్ని అరెస్టు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.