క్రైమ్/లీగల్

మీరు వెళ్లి రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జమ్మూకాశ్మీర్‌లో పర్యటించేందుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్కడ పోలీసుల కస్టడీలో ఉన్న సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే మహ్మద్ యూసుఫ్ తరిగామిని కలుసుకునేందుకు కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. ఈ పర్యటనలో ఎక్కడా రాజకీయాల ప్రస్తావన తీసుకురావద్దని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. పార్టీ సమావేశాలు, నేతలతో భేటీలు కూడదని, జమ్మూకాశ్మీర్ నుంచి తిరిగి వచ్చిన తరువాత తమకు అఫిడవిట్ అందజేయాలని బెంచ్ ఆదేశించింది. సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేయడంతో సీతారాం ఏచూరి 29న జమ్మూకాశ్మీర్ పర్యటనకు వెళ్తారు. ఏచూరి కాశ్మీర్ పర్యటనకు కేంద్రం తీవ్ర అభ్యంతం తెలిపింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సీపీఎం నేత అక్కడి వెళ్లడం శ్రేయష్కరం కాదని ప్రభుత్వం వాదించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం ధర్మాసనం ఎదుట ఇదే వాదన చేశారు. తుషార్ వాదనతో ఏకీభవించని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ‘దేశ పౌరుడు తన స్నేహితుడిని లేదా పార్టీ నాయకుడిని వెళ్లి కలవాలని భావిస్తే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు? దీని వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటీ?’అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏచూరి కాశ్మీర్ వెళ్లి పార్టీ నాయకుడితో మాట్లాడే హక్కు ఉందని న్యాయమూర్తులు ఎస్‌ఏ బాబ్డే, ఎస్‌ఏ నజీర్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నాయని, సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత వెళ్లే అభ్యంతరం లేదన్న సొలిసిటర్ జనరల్ వాదనతో బెంచ్ ఏకీభవించలేదు. పార్టీ మిత్రుడు తరిగామిని క్షేమ సమాచారం తెలుసుకునేందుకే సీతారాం ఏచూరి జమ్మూకాశ్మీర్ వెళ్తున్నారు తప్ప ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని సీపీఎం ప్రధాన కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ కోర్టుకు తెలిపారు. మహ్మద్ యూసుఫ్ తరిగామి జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి నాలుగు పర్యాయాలు ఎన్నికయ్యారు. జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి ఎత్తివేత, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఆయన అదుపులోకి తీసుకున్నారు. తరిగామి చివరి సారిగా ఆగస్టు 4న సీతారాం ఏచూరితో ఫోన్‌లో సంభాషించారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని తరిగామి చెప్పారు.‘నేను సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. యూసుఫ్ మా పార్టీ సీనియర్ నేత. పైగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.
ఆయనను కలిసి క్షేమ సమాచారం తెలుసుకోవల్సిన బాధ్యత నాకుంది’అని ఏచూరి కోర్టుకు తెలిపారు. దీంతో ఆయనకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఇంతకు ముందు జమ్మూకాశ్మీర్ వెళ్తే విమానాశ్రయంలోనే అధికారులు ఆపేశారని సీపీఎం నేత బెంచ్ దృష్టికి తీసుకురాగా‘ మీరు వెళ్లండి. మేం ఆదేశాలు జారీ చేస్తున్నాం. మీరెళ్లి మీ స్నేహితుడిని కలుసుకోండి’అని సుప్రీం ధర్మాసనం ప్రకటించింది. జమ్మూకాశ్మీర్ నుంచి తిరిగి రాగానే తమకు అఫిడవిట్ అందజేయాలని ఏచూరిని కోర్టు ఆదేశించింది.