క్రైమ్/లీగల్

తెలంగాణకు ఐజీ వేధింపుల కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తమిళనాడు విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టర్, ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఎస్ మురుగన్ మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని ఎస్పీ స్థాయి మహిళా ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు బాధ్యతను తమిళనాడు హైకోర్టు తెలంగాణ పోలీసులకు అప్పగించింది. కేసు దర్యాప్తు బాధ్యతను ఒక మహిళా ఐపీఎస్‌కు అప్పగించాలని కూడా కోర్టు సూచించింది. ఈ మేరకు తమిళనాడు చీఫ్‌సెక్రటరీకి జస్టిస్ వినీత్ కొఠారీ, జస్టిస్ సీవీ కార్తికేయన్‌లతో కూడిన బెంచ్ బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ చీఫ్ సెక్రటరీ ద్వారా తెలంగాణ డీజీపీకి ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టు పేర్కొంది. ప్రస్తుతం మురుగన్ తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అత్యంత కీలకమైన కేసులను దర్యాప్తు చేస్తున్నారు. ఆయనకు సహకరించేందుకు ఒక మహిళా ఐపీఎస్ అధికారిని తమిళనాడు ప్రభుత్వం నియమించింది. ఆమె నియామకం మొదలు ఐజీ శారీరకంగా , మానసికంగా తనను వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేయడంతో సీబీసీఐడీ ఐపీసీ సెక్షన్ 341,354, 509 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేయడంతో పాటు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని నియమించింది. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని సైతం ఐజీ ప్రభావితం చేస్తున్నారని మరో పక్క ఆయన సీఎం పళనిస్వామి, డిప్యుటీ సీఎం పన్నీరుసెల్వం అవినీతి కేసులను దర్యాప్తు చేస్తున్నారు కనుక వారి సహకారం ఉంటుందని భావిస్తున్నట్టు ఆమె హైకోర్టును ఆశ్రయించి, తమిళనాడు అధికారులతో సంబంధం లేని వ్యవస్థతో దర్యాప్తు జరిపించాలని కోరారు. దాంతో తమిళనాడు హైకోర్టు కేసు దర్యాప్తు బాధ్యతను తెలంగాణ పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది.