క్రైమ్/లీగల్

బాలికకు అబార్షన్ చేసిన ఆసుపత్రి, డాక్టర్‌పై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 28: నగర పరిధిలోని భవానీపురానికి చెందిన బాలికకు అబార్షన్ చేసిన ఘటనపై జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తీవ్రంగా స్పందించింది. భవానీపురం పోలీసుల వద్దకు వచ్చిన బాలికను సీడబ్ల్యూసీ ముందు హాజరుపర్చగా, నగరంలోని బాలికల ఓపెన్ షెల్టర్‌లో ఆశ్రయమిచ్చారు. హోమ్‌లోని సిబ్బంది కౌనె్సలింగ్ చేసే సమయంలో బాలిక చెప్పిన విషయాలు దిగ్భ్రాంతి కలిగించాయి. భవానీపురానికి చెందిన ఒక అబ్బాయి ద్వారా తాను గర్భం దాల్చానని, విషయం తెలిసిన తల్లిదండ్రులు కేదారేశ్వరపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అబార్షన్ చేయించినట్టు తెలిపింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బాలిక స్టేట్‌మెంట్ తీసుకుని అబార్షన్ చేసిన ఆసుపత్రి, డాక్టర్‌పై విచారణ జరిపి, కేసు నమోదు చేయాలని భవానీపురం పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ బీవీఎస్ కుమార్ తెలిపారు. బాలిక అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఆమెను గర్భవతిని చేసిన అబ్బాయిపై కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించామన్నారు. కమిటీ సభ్యులు ఫ్రాన్సిస్, మల్లేశ్వరరావు, ఇగ్నేషియస్, నాహిద్, తదితర బెంచ్ సభ్యులు పాల్గొన్నారు.