క్రైమ్/లీగల్

వల్లూరుపాలెంలో లభ్యమైన గణేష్‌కుమార్ మృతదేహాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, ఆగస్టు 28: మండలంలోని వల్లూరుపాలెం గ్రామం లాకుల వద్ద బుధవారం పోలిశెట్టి గణేష్‌కుమార్(38) మృతదేహాం లభ్యమైందని ఎస్‌ఐ చిట్టిబాబు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుడివాడ మండలం బిళ్ళపాడు గ్రామానికి చెందిన గణేష్‌కుమార్ విజయవాడ ఆటోనగర్ వెల్డింగ్ పనులు చేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 26వ తేదీన పనులు నిమిత్తం వెళ్ళి ఇంటికి రాకపోవటంతో తండ్రి వెంకటేశ్వరరావు బంధువుల ఇళ్ళల్లో ఆరా తీసిన ఆచూకీ తెలియకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గణేష్‌కుమార్ మృతదేహాం బుధవారం ఉదయం వల్లూరుపాలెం లాకుల వద్ద లభ్యమైందని, 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని ఎస్‌ఐ చిట్టిబాబు తెలిపారు. భార్యాభర్తల మధ్య విభేదాలతో గత సంవత్సరం కాలంగా విడిగా ఉంటున్నారని, అతనికి ఒక కుమార్తె ఉన్నందని తెలిపారు.