క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, ఆగస్టు 28: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంకిపాడు గ్రామానికి చెందిన టీ ఉమామహేశ్వరరావు(48) అశోక్‌నగర్‌లోని టైమ్ ఆసుపత్రిలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. రోజూ కంకిపాడు నుండి ఆసుపత్రికి బైక్‌పై వస్తుంటాడు. మంగళవారం ఆసుపత్రిలో పని వల్ల ఆలస్యమై రాత్రి ఒంటి గంటకు బైక్‌పై కంకిపాడు బయలుదేరాడు. గోసాల సమీపంలో వెనుక నుండి వచ్చిన కారు ఇతని బైక్‌ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఉమామహేశ్వరరావు తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.