క్రైమ్/లీగల్

మీడియాపై ఆంక్షలు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేసిన తర్వాత జమ్మూ-కాశ్మీర్‌లో మీడియాపై ఆంక్షలు విధించడంపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని, జమ్మూ-కాశ్మీర్ యంత్రాంగాన్ని ఆదేశించింది. 370-అధికరణను రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత కఠినమైన నిషేధాజ్ఞలు విధించడం జరిగిందని, అదేవిధంగా మీడియాపైనా ఆంక్షలు విధించడం జరిగిందని సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. కాశ్మీర్‌లో మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలంటూ కాశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ బాసిన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇంటర్నెట్, మొబైల్ సేవలపై ఆంక్షలు విధించారని, పలువురు ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని విడుదల చేయలేదని కాంగ్రెస్ కార్యకర్త తెహసీన్ పూనవాళ్ళ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు జమ్మూ-కాశ్మీర్ యంత్రాంగానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్‌ఏ బాబ్డె, ఎస్‌ఏ నజీర్‌లతో కూడిన ధర్మాసనం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇలాఉండగా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ బాసిన్ మీడియాపై ఆంక్షలు తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని వ్యాజ్యం దాఖలు చేశారు. ఎడిటర్ అనురాధ తరఫున వృందా గ్రోవర్ కోర్టు ముందు తమ వాదన వినిపించారు. గత 24 రోజులుగా మీడియా స్వేచ్చపై, సమాచారంపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయని తెలిపారు.