క్రైమ్/లీగల్

కృష్ణా ట్రిబ్యునల్‌లో కొనసాగుతున్న వాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కృష్ణా ట్రిబ్యునల్‌లో వరుసగా రెండో రోజు బుధవారం కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన కృష్ణా నదీ జలాలను రెండు రాష్ట్రాలకు విభజన చేసేందుకు ఏర్పాటు చేయబడిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్‌లో క్రాస్ ఎగ్జామినేషన్ గురువారం కూడా కొనసాగనుంది. తెలంగాణ తరపు సాక్షిగా ఉన్న ఇంజినీరింగ్ నిపుణుడు ఘనశ్యాం ఝాను ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు వెంకట రమణి, ఉమాపతి క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ, పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకాలు తదితర అంశాలపై ఏపీ తరపు న్యాయవాదులు తెలంగాణ సాక్షిని ప్రశ్నలు అడిగారు.