క్రైమ్/లీగల్

మున్సిపల్ ఎన్నికల పిటిషన్ల విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ మరోమారు వాయిదా పడింది. పిటిషనర్లు దాఖలు చేసిన కౌంటర్లపై సమాధానం చెప్పేందుకు ప్రభుత్వానికి గడువు ఇస్తూ తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. పిటిషనర్ల కౌంటర్లపై సమాధానం చెప్పేందుకు కొంత గడువు కావాలని ప్రభుత్వం తరఫున కౌన్సిల్స్ కోరడంతో హైకోర్టు సెప్టెంబర్ 9 వరకూ గడువు ఇచ్చింది.
కొత్త న్యాయమూర్తులకు సత్కారం
తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గురు కొత్త న్యాయమూర్తులకు సత్కారం జరిగింది. ఇటీవల న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ లక్ష్మణ్ గౌడ్, జస్టిస్ వినోద్ కుమార్, జస్టిస్ అభిషేక్ రెడ్డిలను హైకోర్టు బార్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది.