క్రైమ్/లీగల్

సీఎం, ఇరిగేషన్ మంత్రిపై సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు : ఐదుగురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 28: రాష్ట్ర ముఖ్యమంత్రి, జలవనరుల శాఖామంత్రిని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు సోమశేఖర్‌తో పాటు మరో నలుగురిని విజయవాడ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం తిప్పలకట్ట గ్రామానికి చెందిన కుడితిపూడి సోమశేఖర్ (46), అనంతవరం గ్రామానికి చెందిన అలమనేని సత్యేంద్ర (39), తిప్పలకట్ట గ్రామానికి చెందిన బొంతలపాటి శివ ప్రసాద్ అలియాస్ ప్రసాద్ (46), కొండూరి సీతారామయ్య (34), నిడుమోలు శివయ్య (35) అరెస్టయిన వారిలో ఉన్నారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలానికి చెందిన ఈ ఐదుగురు నిందితులు ప్రస్తుతం వ్యవసాయ పనులు చేసుకుని జీవిస్తున్నారు. ప్రధాన నిందితుడైన సోమశేఖర్ మాత్రం పెయిడ్ ఆర్టిస్టుగా పని చేస్తున్నాడు. వీరు తమలపాకు పంట వేయగా ఈ నెలలో వచ్చిన వరదల కారణంగా నష్టపోయారు. దానిపై ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశ్యంతో వీరందరూ కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రిని, నీటి పారుదల శాఖా మంత్రిని దుర్భాషలాడుతూ, ప్రభుత్వాన్ని అల్లరి చేసే విధంగా ఫోన్‌లో వీడియో చిత్రీకరించి దాన్ని ఫేస్‌బుక్, యూ ట్యూబ్, వాట్సాప్ తదితర సోషల్ మీడియాల్లో అప్‌లోడ్ చేశారు. దీనిపై లాకా వెంగళరావు యాదవ్ అనే వ్యక్తి ఆగస్టు 21వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సత్యనారాయణపురం పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని బుధవారం కోర్టులో హాజరుపరిచారు.