క్రైమ్/లీగల్

కృష్ణా ట్రిబ్యునల్ విచారణ వచ్చే నెల 24కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: కృష్ణా ట్రిబ్యునల్‌లో ఆంధ్రప్రదేశ్ క్రాస్ ఎగ్జామినేషన్ వాయిదా పడింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన కృష్ణానదీ జలాలను రెండు తెలుగు రాష్ట్రాలకు విభజించేందుకు ఏర్పాటు చేసిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తరఫు సాక్షి, ఇంజినీరింగ్ నిపుణుడు ఘనశ్యాం ఝాను ఏపీ తరఫు న్యాయవాది వెంకట రమణి గురువారం కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. తదుపరి విచారణను సెప్టెంబరు 24, 25, 26 తేదీలకు ట్రిబ్యునల్ వాయిదా వేసింది. ఏపీ తరపు న్యాయవాది ఉమాపతి, అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ జీఎన్ రెడ్డి, తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్ రవీందర్ రావు, ఇరు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు.