క్రైమ్/లీగల్

కోయంబత్తూరులో ఎన్‌ఐఏ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయంబత్తూరు: లష్కర్ ఎ తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు తమిళనాడులోకి ప్రవేశించారని నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అధికారులు గురువారం కోయంబత్తూరులోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించారన్న సమాచారం మేరకు ఇటీవలే తమిళనాడులో అలర్ట్ ప్రకటించారు. ఎల్‌ఈటీకి చెందిన ఆరుగురు ఉగ్రవాదులు శ్రీలంక నుంచి సముద్ర మార్గం గుండా తమిళనాడులోకి ప్రవేశించి, కోయంబత్తూరు సహా వివిధ నగరాలకు వెళ్లిపోయారని సమాచారం అందడంతో ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. అయితే, రాష్ట్రంలోకి ప్రవేశించిన ఎల్‌ఈటీ ఉగ్రవాదులతో సంబంధాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి కోయంబత్తూరులోని అయిదుగురి ఇళ్లలో ఎన్‌ఐఏ అధికారులు గురువారం సోదాలు చేశారని పోలీసులు తెలిపారు. ఎన్‌ఐఏ అధికారులు గురువారం సోదాలు జరిపిన ఇళ్లలోని కొన్నింటిపై ఈ దర్యాప్తు సంస్థ గతంలోనూ తమిళనాడు ఐఎస్‌ఐఎస్ మాడ్యూల్‌కు సంబంధించి కూడా దాడులు చేసిందని పోలీసులు వివరించారు. అధికారులు ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.