క్రైమ్/లీగల్

సూర్యాపేటలో అద్దె గర్భం కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఆగస్టు 29: గతంలో ఆడశిశువుల విక్రయాలు, గిరిజన యువతుల అమ్మకాలకు కేంద్రంగా పేరుగాంచిన సూర్యాపేటలో తాజాగా అద్దె గర్భాల ముఠా ఉదంతం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. మూడు నెలల క్రితం అదృశ్యమైన మహిళను ఈ ముఠా మాయమాటలు చెప్పి సరోగసి కోసం చెన్నైకి పంపించిన విషయం సదరు మహిళ భర్త ఫిర్యాదుతో బట్టబయలైంది. అయితే ఈ కేసు విచారణలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తం కావడంతో పాటు ఉన్నతాధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అమాయక మహిళల అర్థిక, సామాజిక బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇక్కడ మకాం వేసిన ముఠా ఏజెంట్లు ప్రభుత్వం నిషేధించిన అద్దె గర్భాల దందాకు కొందరు యువతులను పంపుతున్నట్టు స్పష్టం అవుతోంది. జిల్లాకేంద్రంలోని తాళ్లగడ్డలో నివాసం ఉండే రాజు, శ్రీలత దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతుండటంతో ఈ విషయాన్ని గమనించిన సమీపంలో నివాసముండే వాణి అనే మహిళ శ్రీలతకు మాయమాటలు చెప్పి అద్దెగర్భం దాలిస్తే లక్షలాది రూపాయలు వస్తాయని ఆశచూపి చెన్నై కేంద్రంగా పనిచేసే ముఠా సభ్యురాలైన విజయవాడకు చెందిన కుమారి వద్దకు గత జూన్ 15వ తేదీన పంపించింది. అక్కడి నుండి చెన్నైలోని ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్‌కు తరలించారు. భార్య కన్పించకపోవడంతో ఆ మరుసటి రోజే భర్త రాజు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. దీంతో పోలీసులు అదృశ్యం కేసుగా నమోదుచేశారు. రెండు నెలలు గడిచినా తన భార్య ఆచూకీ దొరకకపోవడంతో భర్త రాజు పోలీసులపై ఒత్తిడి చేయడంతో వారు శ్రీలత కాల్‌డేటాను పరిశీలించి దాని ఆధారంగా వాణి, కుమారీలను విచారించగా అద్దె గర్భం కోసం చెన్నైకు తరలించినట్టు ఇచ్చిన సమాచారంతో అక్కడకు వెళ్లి శ్రీలతను తీసుకువచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా శ్రీలత అదృశ్యం కాగా ఆచూకీ కనిపెట్టి అప్పగించినట్టు కేసును ముగించినట్టు సదరు మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీలతలా మరెవ్వరూ ఇలాంటి ముఠా చేతికి చిక్కకుండా ఉండేందుకు కేసును తప్పు దారి పట్టించకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని ఒత్తిడి తెచ్చారు. ఈలోగా బుధవారం రాత్రి ఈ విషయం విస్తృత ప్రచారం కావడంతో తేరుకున్న పోలీసులు గురువారం ఈ కేసులో ప్రమేయం ఉన్న వాణి, కుమారీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయంపై సూర్యాపేట డీఎస్పీ ఎం.నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ ఈ కేసులో తమ నిర్లక్ష్యం ఎంతమాత్రం లేదన్నారు. మహిళ అదృశ్యమైనట్టు ఫిర్యాదు చేయగా శ్రీలత ఆచూకీ కనిపెట్టి చెన్నై నుండి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించామని, ఇప్పుడు సరోగసి అని చెబుతుండటంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు.