క్రైమ్/లీగల్

బాలికను బలిగొన్న ఫేస్‌బుక్ పరిచయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, ఆగస్టు29: ఫేస్‌బుక్ పరిచయం ఓ అభం శుభం తెలియని బాలిక ప్రాణాలను బలిగొంది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన యువకుడు అమ్మాయి పాలిట యముడిగా మారి ప్రాణాలు తీశాడు. సంచలనాత్మకంగా మారిన ఈ ఘటన యావత్తు ప్రజానీకాన్ని నివ్వెరపరిచింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న రవిశంకర్ కుమార్తె హర్షిణి (15) మహబూబ్‌నగర్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పదవ తరగతి చదువుతోంది. ఈ అమ్మాయికి రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కోహెడ గ్రామానికి చెందిన నవీన్‌రెడ్డి అనే కారు మెకానిక్ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. అలా పరిచయం అయిన నవీన్ రెడ్డి తన మాయ మాటలతో ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో తలపై బండరాయితో మోది హతమార్చి పరారయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించి సీఐ ఆదిరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయ. రవిశంకర్ అనే ప్రభుత్వ ఉద్యోగి తన కుమార్తె హర్షిణి ఈనెల 27వ తేదీ నుండి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో సీసీ కెమెరా దృశ్యాలు, నిందితుడు నవీన్ రెడ్డితో ఫేస్‌బుక్ అకౌంట్లను పరిశీలించి ఆమె అదృశ్యానికి కారణంగా భావించి అతడిని పట్టుకొని విచారించారు. తానే హర్షిణిని హత్య చేసినట్టు నవీన్‌రెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఫేస్ బుక్ ద్వారా హర్షిణికి పరిచయం అయన నవీన్‌రెడ్డి ఈనెల 27న హైద్రాబాద్ నుండి కారులో జడ్చర్లకు వచ్చి హర్షిణిని కారులో ఎక్కించుకొని జడ్చర్ల సమీపంలోని శంకరాయ పల్లి వద్ద నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ కొద్దిసేపు మాట్లాడిన తరువాత నిందితుడు బాలికపై బలత్కారం చేయబోయాడు. అందుకు ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో బండరాయిపైకి తోసివేశాడు. దీంతో హర్షిణి తలకు తీవ్రంగా గాయం కావడంతో ఆమె మరణించిందని భావించి అక్కడే ఉన్న మరో రాయితో ఆమె తలపై మోది హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసుల విచారణలో నవీన్‌రెడ్డి ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా వారిద్దరికీ ఉన్న పరిచయం గురించి ఆరా తీసి అతడిని విచారించగా, తన నేరాన్ని ఒప్పుకున్నాడు. కాగా ఘటన గురించి తెలిసిన వెంటనే ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచిన హర్షిణి మృతదేహాన్ని పరిశీలించి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. జడ్చర్లలో ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన పట్టణంలోని ప్రజా సంఘాలు, విధ్యార్థి సంఘాల నాయకులు పట్టణంలోని సిగ్నల్‌గడ్డ ప్రాంతంలోని అంబేద్కర్ చౌరస్తా, నేతాజీ చౌరస్తా లలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. మానవ మృగంగా మారి అమాయక బాలికను దారుణంగా హతమార్చిన నవీన్ రెడ్డిని వెంటనే ఉరి తీయాలని వారు డిమాండ్ చేశారు. నకిలీ ప్రొఫైల్‌తో ఫేస్‌బుక్ ఖాతా తెరచి అమ్మాయిని మోసగించి దారుణంగా చంపిన నవీన్ రెడ్డి ఏమాత్రం క్షమార్హుడు కాదని ముక్తకంఠంతో వారు నినదించారు. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ఆందోళనతో సుమారు రెండు గంటల పాటు వాహనాల రాక పోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది. దీంతో సీఐ ఆదిరెడ్డి, ఎస్సై శంషోద్దీన్ అక్కడికి చేరుకొని నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి రాస్తారోకోను విరమింపజేశారు. అనంతరం హౌసింగ్ బోర్డు ప్రాంతంలో జడ్చర్ల-మహాబూబ్‌నగర్ రహదారిపై కూడా బాధితుల తరపున కొందరు టైర్లకు నిప్పు పెట్టి ఆందోళన చేశారు.
చిత్రం... హర్షిణి (ఫైల్ ఫొటో), హర్షిణి మృతదేహాన్ని బయటకు తీసుకువస్తున్న స్థానికులు