క్రైమ్/లీగల్

చిదంబరాన్ని కస్టడీకి ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: మనీలాండరింగ్ అన్నది తీవ్రమైన నేరమని, సమాజానికి, జాతికి చేటుతెస్తుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పీ. చిదంబరాన్ని తమ కస్టడీకి అప్పగించాలని న్యాయమూర్తులు ఆర్ బానుమతి, ఎఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనాన్ని ఈడీ కోరింది. చిదంబరాన్ని లోతుకంటే విచారించి కుట్రను ఛేదించాల్సి ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. చిదంబరం విచారణను తప్పించుకోడానికి ముందస్తు బెయిల్ కోరుతున్నారని ఈడీ ఆరోపించింది. ఆయనకు ఎట్టిపరిస్థితుల్లోనూ వెసులుబాటు కల్పించ వద్దని న్యాయస్థానాన్ని కోరారు.‘మనీలాండరింగ్ తీవ్రమైన నేరం. సమాజానికి, జాతికి వ్యతిరేకమైంది. చిదంబరం విషయంలో మేం మరింత లోతుగా విచారించిన నిజాలేమిటో నిగ్గు తేల్చాల్సి ఉంది. అది ఈడీ విధి’అని మెహతా అన్నారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం వెనక దాగి ఉన్న కుట్రను ఛేదించాల్సి ఉన్నందున మాజీ మంత్రిని తమ కస్టడీకి ఇప్పించాలని కోర్టును కోరారు. ఆర్థిక నేరాలు తీవ్రాతిత్రివమైనవని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయనీ సందర్భంగా బెంచ్ దృష్టికి తెచ్చారు. కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయని సొలిసిటర్ జనరల్ స్పష్టం చేశారు. విచారణను తప్పించుకునేందుకే చిదంబరం ముందస్తు బెయిల్ కోరుతున్నారని ఆయన ఆరోపించారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో చిదంబరం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈడీ అరెస్టు చేయకుండా కోర్టు ఆయనకు తాత్కాలిక రక్షణ కల్పించింది. ఈ కేసు మూడు రోజులుగా సుప్రీంలో విచారణ జరుగుతోంది.
చిత్రం...మనీ లాండరింగ్ కేసును ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం