క్రైమ్/లీగల్

చిదంబరానికి మరో 3రోజుల కస్టడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఐఎన్‌ఎక్స్ మీడియా స్కాం కేసులో మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి మరో మూడు రోజులు సీబీఐ కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశించింది. శుక్రవారం కోర్టు ఆదేశాలతో చిదంబరం సెప్టెంబర్ 2 వరకూ కస్టడీలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐఎన్‌ఎక్స్ కేసులో మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉందని, కాంగ్రెస్ సీనియర్ నేతను ప్రశ్నించాలని సీబీఐ స్పష్టం చేసింది. ఈనెల 26న చిదంబరాన్ని నాలుగురోజుల కస్టడీ ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువుముగిసిపోవడంతో మరో మూడు రోజులు కస్టడీ పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి అజయ్‌కుమార్ ఖుహర్ ఆదేశించారు.‘ఐఎన్‌ఎక్స్ మీడియా స్కాం కేసులో విచారణ సాగుతోంది. కేసులో కీలకంగా ఉన్న చిదంబరాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని దర్యాప్తు అధికారి చెప్పారు. కాబట్టి నిందితునికి మరో నాలుగు రోజులు రిమాండ్ విధిస్తున్నా’అని న్యాయమూర్తి ప్రకటించారు. సెప్టెంబర్ 2 వరకూ మాజీ మంత్రి సీబీఐ కస్టడీలోనే ఉంటారు. ఆగస్టు 21న చిదంబరం(73) అరెస్టయ్యారు. ఇప్పటి నుంచీ ఆయన సీబీఐ కస్టడీలోనే ఉన్నారు. అంతకు ముందు రోజు ముందస్తు బెయిల్ కోసం చిదంబరం పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు డిస్మిస్ చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా చిదంబరంను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. నిందితుడు విచారణకు సహరించడం లేదని, కేసులో ఆయనే కీలకం కాబట్టి బయటకు వెళ్తే సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థ పేర్కొంది. కేసు విచారణ తుది దశకు చేరుకోనందున ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని అడిషనల్ సొసిసిటర్ జనరల్ కేఎం నటరాజ కోర్టును అభ్యర్థించారు. ‘ఐఎన్‌ఎక్స్ కుంభకోణానికి సంబంధించి మరిన్ని పత్రాలు పొందుపరచాల్సి ఉంది. కాబట్టి మాజీ మంత్రిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వండి’ అని ఆయన కోరారు. ‘కేసు తీవ్రత మీకు తెలుసు. అలాంటప్పుడు ముందు ఐదు రోజుల కస్టడీనే కోరారు. రెండోసారీ ఐదు రోజులే అడుగుతున్నారు. ఏమిటది?’అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనిపై అడిషనల్ సొలిసిటర్ జనరల్ బదులిస్తూ దర్యాప్తులో అధికారులు అడిగిన ప్రశ్నలకు చిదంబరం ఇచ్చే సమాధానాలను బట్టి ఇన్ని రోజులు కావాలని అడుగుతామని నాటరాజ చెప్పారు. కేసు డైరీ పరిశీలించిన న్యాయమూర్తి అజయ్‌కుమార్ నిందితుడి రిమాండ్‌కు సంబంధించి సీబీఐ వైఖరి అస్పష్టంగా ఉందని అన్నారు. అరెస్టు చేసిన వెంటనే చిదంబరాన్ని కోర్టులో హాజరుపరిచిన తొలిరోజు దర్యాప్తు సంస్థ 15 రోజుల రిమాండ్ కోరిందని ఆయన గుర్తుచేశారు. అయితే రోజుకు ఎనిమిది నుంచి పది గంటలు చిదంబరాన్ని ప్రశ్నిస్తున్నా, ఆయన నుంచి సరైన సమాధానాలు రావడం లేదని, విచారణకు సహకరించం లేదని సీబీఐ ఆరోపించింది. అలాగే తనకు సోమవారం వరకూ కస్టడీ విధించినా ఇబ్బంది లేదని నిందితుడే స్వయంగా సుప్రీం కోర్టుకు తెలిపారని నాటరాజ వెల్లడించారు. కస్టడీలు ఎన్ని రోజులు ఏమిటీ అన్నదాన్ని మీరే చెప్పేస్తే కోర్టులు ఉన్నది ఎందుకని సీబీఐ అలాగే చిదంబరం తరఫున్యాయవాది దయాన్ కృష్ణన్‌ను ఉద్దేశించి న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తన క్లయింట్‌ను 55 గంటలు ప్రశ్నించారని, దాన్లో డబ్బు వ్యవహారం ఎక్కడా ప్రస్తావనకు రాలేదని కృష్ణన్ చెప్పారు. మూడు ఫైళ్లను ఇరవై సార్లు మాకు చూపించారు. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు చిదంబరం సమాధానం చెబుతున్నారు’అని న్యాయవాది స్పష్టం చేశారు.
సుప్రీంకు ఈడీ సమగ్ర డాక్యుమెంట్లు
ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి సమగ్ర డాక్యుమెంట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారంనాడు సుప్రీంకోర్టుకు అందజేసింది. ఈ డాక్యుమెంట్లను ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జస్టిస్ ఆర్.్భనుమతి, ఏఎస్ బొపన్న నేతృత్వంలోని డివిజన్ బెంచ్‌కు అందజేశారు.