క్రైమ్/లీగల్

ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ జేకే మహేశ్వరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరిని సుప్రీకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. దేశ వ్యాప్తంగా ఎనిమిది హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను కొలీజయం శుక్రవారం సిపార్సు చేసింది. జస్టిస్ మహేశ్వరి మధ్యప్రదేశ్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో సివిల్, క్రిమినల్ న్యాయవాదిగా గతంలో ఆయన సేవలు అందించారు. 2005లో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2008లో ఆయన పూర్తి స్థాయిలో న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు జస్టిస్ విక్రంనాథ్ పేరును ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొలీజియం సిఫార్సు చేయగా కేంద్రం వెనక్కి తిప్పి పంపింది. దీంతో తాజాగా జస్టిస్ మహేశ్వరి పేరును సుప్రీకోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. అలాగే జస్టిస్ విక్రమ్‌నాథ్‌ను గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్ అజయ్ లంబను గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్ రవి శంకర్ ఝాను పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్ ఎల్ నారాయణ స్వామిని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్ ఇంద్రజిత్ మహంతిని రాజస్థాన్ హైకోర్టు సీజేగా కొలీజియం సిఫార్సు చేసింది. అలాగే జస్టిస్ అరుప్ కుమార్ గొస్వామిని సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్ ఎస్ మణికుమార్‌ను కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. వీరితో పాటుగా వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు నాలుగురిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ మురారీ, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, హిమచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వీ రామసుబ్రహ్మణ్యం, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హృషికేశ్ రాయ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేసింది.