క్రైమ్/లీగల్

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ వాకాటికి సుప్రీం బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 30: నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డికి సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వీఎన్‌ఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ.190 కోట్ల రుణం తీసుకున్న అంశంలో మాజీ ఎమ్మెల్సీ వాకాటిపై సీబీఐ ఫోర్జరీ, మోసం తదితర కేసులను నమోదు చేసింది. ఈ కేసుల్లోనే వాకాటిని అరెస్టు చేశారు. బెయిల్ కోసం వాకాటి కర్నాటక హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ శుక్రవారం జస్టిస్ రోహింటన్ పాలీ నారీమన్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారించి, బెయిల్ మంజూరు చేసింది. వాకాటి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు. సీబీఐ తరపున సీనియర్ న్యాయవాది ఆర్ బాల సుబ్రమణియన్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదానలు విన్న ధర్మాసనం మాజీ ఎమ్మెల్సీ వాకాటికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. పిటిషనర్ తక్షణమే పాస్‌పోర్టును సరెండర్ చేయాలని, ఆరు నెలల పాటు బెంగళూరు వెళ్లకూడదని ధర్మాసనం షరతులు విధించింది. ప్రతి పది రోజులకు ఒక సారి హైదరాబాద్‌లో సంబంధిత పోలీసు స్టేషన్‌లో రిపోర్టు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.