క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో ముగ్గురు దేవాదాయ శాఖ ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, ఆగస్టు 30: మఠం భూమి లీజు పొడిగింపు కోసం లీజుదారుడి నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకున్న ముగ్గురు దేవదాయశాఖ ఉద్యోగులను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని కరిబసప్ప స్వామి గవిమఠంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ శంకర్, జూనియర్ అసిస్టెంట్లు నారాయణస్వామి, గోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఉరవకొండలోని కరిబసప్ప స్వామి గవి మఠానికి చెందిన ఐదు సెంట్ల భూమిని రాజు లీజుకు తీసుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు. గత మార్చికి లీజు గడువు ముగియడంతో రెన్యూవల్ కోసం కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ శంకర్‌ను కలవగా రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే రూ. 2లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న రాజు విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువచ్చాడు. వారి సూచన మేరకు శుక్రవారం శంకర్ సూచన మేరకు జూనియర్ అసిస్టెంట్లు నారాయణస్వామి, గోపాలకృష్ణకు డబ్బు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ నాగభూషణం సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కార్యాలయంలో ఉన్న సీనియర్ అసిస్టెంట్ శంకర్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. శనివారం కర్నూలులోని ఏసీబీ కోర్టులో వీరిని హాజరుపరచనున్నట్లు డీఎస్పీ నాగభూషణం తెలిపారు.