క్రైమ్/లీగల్

వైద్యుడి కుటుంబం ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఆగస్టు 30: తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పట్టణంలో ప్రముఖ ఎముకల వైద్య నిపుణుడు ఒకరు భార్య, కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఆసుపత్రి పైభాగంలో నివాసం ఉంటున్న వైద్యుడి కుటుంబం శుక్రవారం ఉదయం ప్రాణాంతక మత్తుమందు కలిపిన సెలైన్ ఎక్కించుకోవడంతో మృతిచెందారు. విగతజీవులై పడివున్న వీరిని ఆసుపత్రి సిబ్బంది గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఆర్థిక ఇబ్బందులే వీరి ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. మృతిచెందిన వైద్యుడి కుమారుడు కూడా ఎంబీబీఎస్ పూర్తిచేసి, పోస్టుగ్రాడ్యుయేషన్ చేస్తుండటం గమనార్హం. వివరాలిలావున్నాయి... అమలాపురం పట్టణంలో డాక్టర్ పెనుమత్స రామకృష్ణంరాజు గత 20 ఏళ్లుగాలా శ్రీకృష్ణా ఆర్ధోపెడిక్ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. సొంత భవనం కింది భాగంలో ఆసుపత్రి ఉండగా, పైభాగంలో డాక్టర్ కుటుంబం నివసిస్తోంది. రామకృష్ణంరాజుకు భార్య లక్ష్మీదేవి, కృష్ణ సందీప్, వంశీకృష్ణ అనే ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు కృష్ణసందీప్ విశాఖపట్నంలో ఎంబీబీఎస్ పూర్తిచేసుకుని, హైదరాబాద్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. చిన్నకుమారుడు వంశీకృష్ణ రాజమహేంద్రవరంలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నారు. శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో రామకృష్ణరాజు భార్య లక్ష్మీదేవి ఆసుపత్రిలోకి వచ్చి నైట్ డ్యూటీలో ఉన్న కాంపౌండర్‌తో ఓపీ జాగ్రత్తగా చూసుకోండని చెప్పి, భవనం పైభాగంలోని ఇంట్లోకి వెళ్లిపోయారు. ఉదయం 9గంటల సమయంలో ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది డాక్టర్ రామకృష్ణంరాజు కోసం పైనున్న నివాసంలోకి వెళ్లినపుడు గదిలో రామకృష్ణంరాజు (50), భార్య లక్ష్మీదేవి (45), పెద్ద కుమారుడు కృష్ణ సందీప్ (24) విగతజీవులై పడివుండటాన్ని గుర్తించారు. సుకాల్ అనే మందును సెలైన్‌లో కలిపి, వీరు ముగ్గురు వంట్లోకి ఎక్కించుకున్నట్టు భావిస్తున్నారు. ఈ మందు మనిషి శరీరంలోకి వెళ్లిన నిముషాల వ్యవధిలోనే అవయవాలు పనిచేయకుండా శ్వాస ఆగిపోతుందని వైద్యుడొకరు తెలిపారు. మృతదేహాలు పడివున్న గదిలో బీరువాకు సెలైన్ బాటిల్ తగిలించివుంది. రాజమహేంద్రవరంలో ఉన్న వైద్యుని చిన్న కుమారుడు వంశీకృష్ణకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఇంటికి చేరుకుని, గుండెలవిసేలా రోదించారు. సమాచారం అందుకున్న అమలాపురం డీఎస్పీ మాసూం బాషా, పట్టణ సీఐ సురేష్‌బాబు, ఎస్సైలు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అధిక అప్పులు, ఒత్తిడి వల్లే వైద్యుడి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నామని డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా తెలిపారు. అమలాపురంలోని పలు ప్రైవేటు వడ్డీ వ్యాపారులతో పాటు బ్యాంకుల వద్ద కూడా రుణాలు తీసుకున్నట్టు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సురేష్‌బాబు తెలిపారు.