క్రైమ్/లీగల్

హైకోర్టులో హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 30: మహానగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టి, వాతావరణాన్ని మరింత పచ్చదనంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని శుక్రవారం హైకోర్టు ఆవరణలో నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ హాజరైన ఈ కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ అభినందన్ కుమార్, జస్టిస్ అమర్‌నాథ్, జస్టిస్ వినోద్‌కుమార్, జస్టిస్ ఏ.అభిషేక్‌రెడ్డి, జస్టిస్ కే.లక్ష్మణ్, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తదితరులు వేర్వేరుగా మొక్కలను నాటారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని నందనవనంగా తీర్చిదిద్దేందుకు హరితహారం కార్యక్రమం కింద కోట్లాది మొక్కలను ప్రజలకు పంపిణీ చేయటంతో పాటు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాల్లో ఉద్యమ స్ఫూర్తితో నాటుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులకు మట్టితో తయారుచేసిన వినాయకుడి విగ్రహాలను అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూర్యకిరణ్‌రెడ్డి, అదనపు కమిషనర్ కృష్ణ, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.