క్రైమ్/లీగల్

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదవేగి, ఆగస్టు 30: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్‌పై పెదవేగి పోలీసుస్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదయ్యింది. ఇసుక తీసుకెళుతున్న తనపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు దౌర్జన్యంచేసి, కులం పేరుతో దూషించి కొట్టారని పెదవేగి మండలం చినకడిమి గ్రామానికి చెందిన చెరకు జోసఫ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పెదవేగి ఎస్సై బి మోహనరావు శుక్రవారం కేసు నమోదుచేశారు. ఎస్సై కథనం ప్రకారం చినకడిమికి చెందిన చెరకు జోసఫ్ గ్రామ సమీపంలో తమ్మిలేరు పక్కన ఉన్న పొలంలో ఇసుకను తవ్వుకుని తీసుకెళుతున్నాడు. ఇసుక తీసుకెళుతున్న జోసఫ్‌పై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, అతని అనుచరులు వచ్చి ఇసుకను ఇక్కడి నుంచి తీసుకెళ్లడమేమిటంటూ కులం పేరుతో దూషించి కొట్టారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేసి, ఏలూరు డీఎస్పీ ఒ దిలీప్‌కిరణ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మోహనరావు తెలిపారు.
అజ్ఞాతంలోకి మాజీ ఎమ్మెల్యే
తనపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదుకావడంతో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు ధర్నాలో పాల్గొనడానికి ప్రయత్నించిన చింతమనేనిని శుక్రవారం మధ్యాహ్నం వరకు పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే మధ్యాహ్నం 2గంటల తరువాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. శని, ఆదివారాలతోపాటు సోమవారం వినాయక చవితి సందర్భంగా కోర్టుకు సెలవులు కావడం, ఈసమయంలో అరెస్టు చేస్తే బెయిలుకు అవకాశం ఉండదనే ఆలోచనతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం.