క్రైమ్/లీగల్

ఆ విద్యార్థినిని ఈరోజే హాజరుపరచండి యూపీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు స్వామి చిన్మయానంద్ తనను వేధించారని ఆరోపించిన తరువాత అదృశ్యమయి, రాజస్థాన్‌లో ఉన్న ట్టు తేలిన న్యాయశాస్త్ర విద్యార్థినిని ఈ రోజే తన ముందు హాజరు పరచాల్సిందిగా సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సదరు విద్యార్థిని రాజస్థాన్‌లో ఉండగా శుక్రవారం కనుగొనడం జరిగిందని, ఆమెను తల్లిదండ్రులతో సమావేశపరచడానికి షాజహాన్‌పూర్‌కు తీసికెళ్లడం జరిగిందని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తరపు న్యాయవాది అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. ఆ విద్యార్థినిని కోర్టులో ఎప్పుడు హాజరుపరచగలరని న్యాయమూర్తులు ఆర్.్భనుమతి, ఏఎస్ బొపన్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదిని ముందు ప్రశ్నించింది. ఆ విద్యార్థిని పోలీసు టీమ్‌తో కలిసి షాజహాన్‌పూర్‌కు వెళ్తున్నారని, ఇప్పుడు ఫతేపూర్ సిక్రికి చేరుకున్నారని న్యాయవాది చెప్పారు. కోర్టు ఆ విద్యార్థినిని శుక్రవారమే హాజరు పరచవలసిందిగా అధికారులను ఆదేశి స్త, ఆమెను రెండున్నర గంటల్లో ఇక్కడికి తీసుకు రావడం జరుగుతుందని న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. దీంతో ధర్మాసనం శుక్రవారమే ఆ విద్యార్థినిని కోర్టు ముందు హాజరు పరచాల్సిందిగా యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ధర్మాసనం ముందుగా ఆ విద్యార్థినితో రహస్యంగా మాట్లాడటం జరుగుతుందని, తర్వాత సమావేశమై తగిన ఆదేశాలు జారీ చేయ డం జరుగుతుందని కోర్టు తెలిపింది. న్యాయశాస్త్ర విద్యార్థిని అదృశ్యానికి సంబంధించిన పూర్వాపరాలను వివరించడంతో పాటు విచారించాల్సిందిగా కోరుతూ కొంతమంది న్యాయవాదుల బృందం సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కి లేఖ రాయడంతో అత్యున్నత న్యాయస్థానం ఈ అంశాన్ని సుమోటోగా విచారించాలని నిర్ణయించింది. స్వా మి చిన్మయానంద్ తనను వేధించారని ఆరోపిస్తూ న్యాయశాస్త్ర విద్యార్థినిని ఒక వీడియో క్లిప్‌ను వి డుదల చేసిన తర్వాత అదృశ్యం కావడంతో షాజహాన్‌పూర్ పోలీసులు మంగళవారం స్వా మి చిన్మయానంద్‌పై కేసు నమోదు చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆ విద్యార్థిని వీడియో క్లిప్‌లో ఆరోపించారు. స్వామి చిన్మయానంద్ తన కుమార్తెను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థిని తండ్రి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, స్వామి చిన్మయానంద్ తరపు న్యాయవాది ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.