క్రైమ్/లీగల్

‘సింగరేణి‘ కేసు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: భూపాలపల్లి జిల్లా కాకతీయ గనిలో మైనింగ్ కార్యకలాపాల మూలంగా పరిసర ప్రాం తాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇబ్బందులు పడుకుండా చూడాలని సింగరేణి కాలరీస్ యాజమాన్యానికి సుప్రీం కోర్టు సూచించింది. ఈ కేసును సెప్టెంబర్ 5వ తేదీకి వాయిదా వేసిన కోర్టు, ప్రజా సమస్యలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. నివాస ప్రాంతాలకు 150 మీటర్లలోపు మైనింగ్
చేసుకొసుకొవచ్చంటూ కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతులను ఎన్జీటీ నిలుపుదల చేయడాన్ని సవాల్ చేస్తూ సింగరేణి కాలరీస్ దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం జస్టిస్ లావు నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణ వచ్చింది. మైనింగ్ వల్ల ఆ ప్రాంతంలో వాయు, జల, శబ్ద కాలుష్యం ఏర్పడుతుందని సీపీసీని తన నివేదికలో పేర్కొన్న విషయాన్ని ధర్మాసనానికి పిటిషనర్ల తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ వివరించారు. మైనింగ్ మూలంగా ప్రజలు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత సింగరేణి కాలరీస్ యాజమాన్యానికి ఉందని ధర్మాసనం సూచించింది. కాగా, ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ సిద్ధంగా వుందని తమకు రెండు రోజుల గడువు కావాలని కేంద్ర పర్యావరణశాఖ తరపు న్యాయవాది కోరారు. దీనికి అనుమతినిచ్చిన ధర్మసనం తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.