క్రైమ్/లీగల్

మేడ్చల్‌లో తల్లీ పిల్లల అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఆగస్టు 31: తల్లీ పిల్లలు అదృశ్యమైన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మేడ్చల్ మునిసిపాలిటీ అత్వెల్లికి చెందిన కెఎం సాదిఖ్ భార్య బిన్‌షాబీ(30) ఈ నెల 27వ తేదీ సాయంత్రం తన ఇద్దరు పిల్లలు కూతురు తఫీమ్(14), కుమారుడు అవేస్(7)లను తీసుకుని ఇంటి నుండి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. రాత్రి ఇంటికి వచ్చిన సాదిఖ్‌కు భార్య పిల్లలు కనిపించకపోయేసరికి ఆందోళనకు గురయ్యాడు. చుట్టుపక్కల, బంధువుల వద్ద, తెసిన చోటల్లా వారి ఆచూకీ గురించి ఆరా తీసినా ఫలితం లేకపోయింది. దీంతో చేసేది లేక శనివారం సాదిఖ్ మేడ్చల్ పోలీసులను ఆశ్రయించి తన భార్య పిల్లలలు అదృశ్యమయ్యారని ఫిర్యాదు చేశాడు. తన ఇంటి పక్కన గల ముజీబ్ అనే వ్యక్తిపై తనకు అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.