క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ‘సచివాలయ’ అభ్యర్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధురవాడ, సెప్టెంబర్ 1: వార్డు, సచివాలయ పరీక్ష రాసి తన సోదరి ఇంటికి వెళ్తున్న ఆ మహిళా అభ్యర్థిని మృత్యువు కబళించింది. విశాఖపట్నంలోని మధురావడ కూడలి వద్ద ఆదివారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో దివ్యమాధురి (23) మృతిచెందింది. పీఎం పాలెం సిఐ ఎ.రవికుమార్ తెలిపిన వివరాలప్రకారం నగరంలోని పాత గోపాలపట్నం ప్రాంతానికి చెందిన బెహరా దివ్యమాధురి, భర్త వెంకట దుర్గాప్రసాద్‌తో కలిసి పీఎం పాలెంలో ఉన్న సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాలలో వార్డు సచివాలయ ఉద్యోగానికి పరీక్షరాసేందుకు ద్విచక్ర వాహనంపై వచ్చింది. పరీక్ష అనంతరం తగరపువలసలో ఉన్న తన అక్క ఇంటికి వెళ్లేందుకు భర్తతో పాటు బయలుదేరింది. మార్గమధ్యంలో మధురవాడ కూడలి వద్ద వారి ద్విచక్రవాహనానికి వెనుక ఉన్న కారును ఆ వెనుక ఉన్న లారీ బలంగా ఢీకొట్టింది. దాంతో కారు ఒక్కసారిగా వీరి వాహనాన్ని ఢీకొట్టడంతో భార్యాభర్తలిద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో దివ్యమాధురి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త వెంకట దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ హరికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిత్రం...రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దివ్యమాధురి