క్రైమ్/లీగల్

ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, సెప్టెంబర్ 1: రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న ఆర్ భాగ్యలక్ష్మి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. కే 2 హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న భాగ్యలక్ష్మి మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందింది. పశ్చిమ గోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి 2014లో నూజివీడు ట్రిపుల్ ఐటీలో చేరింది. రెండ్రోజులుగా ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ ఘర్షణ పడుతోందని సహచర విద్యార్థులు ట్రిపుల్ ఐటీ అధికారులకు తెలిపారు. ఆదివారం భోజనం అనంతరం భాగ్యలక్ష్మి ఫోన్‌లో మాట్లాడుకుంటూ పీయూసీ విభాగంలో ఖాళీగా ఉన్న గదిలోకి వెళ్లి, ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భాగ్యలక్ష్మి హాస్టల్ రూమ్‌లో కనిపించక పోవటంతో సహచర విద్యార్థులు విషయాన్ని ట్రిపుల్ ఐటీ అధికారులకు తెలిపారు. వెంటనే అధికారులు, విద్యార్థులు వెతకటం ప్రారంభించారు. చివరకు పీయూసీ విభాగంలోని 68వ నెంబరు రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఉన్న భాగ్యలక్ష్మిని గమనించారు. వెంటనే అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన ప్రాంతాన్ని డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రామచంద్రరావు, ఎస్‌ఐ శ్రీనివాసరావు పరిశీలించారు. భాగ్యలక్ష్మి చదువులో ముందంజలో ఉంటుందని, ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని సహచర విద్యార్థులు, ట్రిపుల్ ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిత్రం... ఉరేసుకున్న భాగ్యలక్ష్మి,
*ఇన్‌సెట్‌లో విద్యార్థిని భాగ్యలక్ష్మి (ఫైల్‌ఫొటో)