క్రైమ్/లీగల్

భద్రాచలం ప్రాంతం నుంచి మహారాష్టక్రు గంజాయి స్మగ్లింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడ్వాయి, సెప్టెంబర్ 1: ములుగు జిల్లా తాడ్వాయి (మేడారం) మండలంలోని కాటాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం కారులో తరలిస్తున్న వంద కేజీల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌లో ములుగు డీఎస్పీ విజయసారధి తెలిపిన వివరాల ప్రకారం పస్రా సీఐ అనుముల శ్రీనివాస్ ఆదేశాల మేరకు తాడ్వాయి ప్రొబేషనరీ ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో సివిల్, సీఆర్‌పీఎఫ్ బలగాలతో కాటాపూర్ క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో భద్రాచలం నుంచి కాటాపూర్ వైపు వస్తున్న ఏపీ 03 టీఎస్ 1359 నెంబరు గల కారును ఆపి తనిఖీ చేయగా అందులో ఎండు గంజాయి కనిపించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. రేగొండ మండలం తిర్మలగిరికి చెందిన పల్నాటి సదానందం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పూతలపాడుకు చెందిన వేముల విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకోగా మరో నలుగురు పరారయ్యారు. ఇదిలావుండగా భద్రాచలం ప్రాంతంలోని ఒక గ్రామంలో గంజాయిని కొనుగోలు చేసి వాటిని వరంగల్ మీదుగా మహారాష్టక్రు తరలించేందుకు కారులో వెళ్తుండగా వాహనాల తనిఖీలో పట్టుబడినట్లు డీఎస్పీ వివరించారు. అదుపులో ఉన్న ఇద్దరితో పాటు గంజాయి రవాణాలో సంబంధం ఉన్న మరో నలుగురు చిత్తూరు జిల్లాకు చెందిన కట్ల నితీన్‌రెడ్డి, కిరణ్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని తిర్మలగిరికి చెందిన వంచం శివ, దేశిని తిరుపతి పరారీలో ఉన్నట్టు డీ ఎస్పీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్లను తహసీల్దార్ పాలకుర్తి భిక్షం సమక్షంలో పంచనామా నిర్వహించి నిందితులను సదానందం, విజయ్‌కుమార్‌లను రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.5 లక్షల విలువ ఉంటుందని వివరించారు. పరారీలో ఉన్న నలుగురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. వాహనాల తనిఖీల్లో గంజాయిని పట్టుకున్న పోలీసులను డీఎస్పీ అభినందించారు.

చిత్రం... పట్టుబడ్డ గంజాయిని చూపిస్తున్న పోలీసులు