క్రైమ్/లీగల్

శాసనాలు చేయాల్సింది చట్టసభలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: దేశంలో పెరిగిపోతున్న జనాభాను నియంత్రించడానికి చట్టాలు తీసుకు రావాల్సింది పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. మితిమీరిపోతున్న జనాభా వల్ల నేరాలూ తీవ్రమవుతున్నాయని, దీని దృష్ట్యా జనాభాను నిరోధించేందుకు ఇద్దరు పిల్లల నిబంధనతోపాటు అనేక చర్యలు చేపట్టాలంటూ దాఖలైన ప్రజాహిత పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ప్రధాన న్యాయమూర్తి డీఎన్ పటేల్, న్యాయమూర్తి సీ హరిశంకర్‌లతో కూడిన ఈ బెంచ్ చట్టసభల్లో చేసే చట్టాలు సక్రమంగా అమలయ్యేలా చూడడమే కోర్టుల బాధ్యత అని తెలిపారు. అంతేకానీ చట్టాలు చేయడం కోర్టు బాధ్యత కాదని ఈ బెంచ్ వెల్లడించింది. జనాభాకు సంబంధించి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కమిషన్లు వేశాయని, అలాగే జన విస్ఫోటనాన్ని నిరోధించేందుకు చట్టాలను తీసుకువచ్చే పూర్తి యంత్రాంగం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఉందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. బీజేపీ నాయకుడు అశ్వినీకుమార్ ఉపాధ్యాయ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.