క్రైమ్/లీగల్

గోడ కూలి ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 3: ఇంటి గోడ కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వినాయక చవిత పండుగ రోజున విశాఖలో చోటుచేసుకున్న విషాద ఘటన కలచివేసింది. భవన నిర్మాణ సమయంలో పక్కనే ఉన్న భవనం ప్రహరీ గోడ కూలి శివ, శంకరరావు అనే వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందగా, మరో వ్యక్తి ఇల్లు వర్సన్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. విశాఖ నగరం డాబాగార్డెన్స్‌లో భవన నిర్మాణ పనులను ముగ్గురు కూలీలు చేపట్టారు. దీనిలో భాగంగా సోమవారం పునాదులు తవ్వుతుండగా, పక్కనే ఉన్న మరో భవనం తాలూకా ప్రహరీ కింద డ్రిల్లింగ్ పనులు చేపట్టారు. సోమవారం సాయంత్రం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లాల్సి ఉండగా, కొద్ది పాటి పనులు పూర్తి చేసేద్దామనే ఉద్దేశంతో మరికొంత సమయం పనుల్లో ఉండిపోయారు. పనులు జరుగుతుండగా ప్రహరీ ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రహరీ శిథిలాల కింద ముగ్గు కూలీలు చిక్కుకున్నట్టు స్థానికులు గుర్తించారు. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన శివ, విజయనగరం ప్రాంతానికి చెందిన శంకరరావుఅక్కడికక్కడే మృతి చెందగా, స్థానికులు ఇల్లువర్సన్ అనే వ్యక్తిని శిథిలాల నుంచి బయటకు తీసి కాపాడగలిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.