క్రైమ్/లీగల్

లండన్‌లో ఖమ్మం విద్యార్థి శ్రీహర్ష మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 3: లండన్‌లో 12 రోజుల క్రితం గల్లంతయిన ఖమ్మం విద్యార్థి శ్రీహర్ష(21) మృతదేహం లభ్యమైంది. శ్రీహర్ష తండ్రి ఉదయ్‌ప్రతాప్ ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నారు. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్ళిన శ్రీహర్ష గత నెల 23వ తేదీన అదృశ్యమవ్వగా లండన్‌లోని బీచ్ దగ్గర శ్రీహర్ష సెల్‌ఫోన్, బ్యాగ్, ల్యాప్‌టాప్‌ను పోలీసులు గుర్తించారు. వాటి ఆధారంగా శ్రీహర్ష మృతదేహంగా నిర్ధారించుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కొడుకు ఆచూకీ కోసం హడావుడిగా లండన్ వెళ్ళిన తల్లిదండ్రులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుల సహకారంతో అక్కడ అధికారులను కలిసి విచారించారు. అయితే శ్రీహర్ష తప్పిపోయిన తర్వాత అదేరోజు ఆయన అకౌంట్‌లో నుంచి 250 పౌండ్లు ఇతరులకు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల శ్రీహర్ష ఆధ్యాత్మిక సభల్లో పాల్గొన్నట్టు తెలిసింది. అలాగే లండన్‌లోని ఆయన గదిలో కూడా ఆధ్యాత్మికతకు సంబంధించిన పుస్తకాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. ఈనేపధ్యంలో శ్రీహర్ష మృతదేహం మంగళవారం లండన్ బీచ్ ఒడ్డున దొరకగా, ఆయన మృతిపై ఏర్పడిన అనుమానాల ఆధారంగా అక్కడి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే శ్రీహర్ష స్నేహితులతో పాటు కాలేజీ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

శ్రీహర్ష(ఫైల్‌ఫొటో )