క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన ట్రెజరీ ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, సెప్టెంబర్ 3: ఏసీబీ వలలో అవినీతి ఉద్యోగులు ఇద్దరు చిక్కారు. న్యాయంగా తనకు రావాల్సిన క్వాంటం పెన్షన్ ఇవ్వడానికి సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఉద్యోగి ఒకరు 15 వేల రూపాయల లంచం ఇస్తేనే ఫైలు కదులుతుందని తెగేసి చెప్పడంతో చేసేది లేక పెన్షన్‌దారు మనవడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ ఆధికారులు ఇచ్చిన 10 వేల రూపాయలు లంచంగా తీసుకుంటూ మంగళవారం ఇద్దరు ఉద్యోగులు పట్టుబడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే ముష్కమ్ అనసూయ తనకు రావాల్సిన క్వాంటమ్ పెన్షన్ అప్రూవల్ కోసం సిరిసిల్ల జిల్లా వేములవాడ సబ్ ట్రెజరర్ కార్యాలయం చుట్టూ తిరుగుతుండగా కార్యాలయం లోని సీనియర్ అసిస్టెంట్ మల్లేశం 15వేలు లంచం అడగగా అనసూయ మనవడు రాహుల్ ఏసీబీ డీఎస్పీ భద్రయ్యను ఆశ్రయించాడు. దీంతో వారు ఉద్యోగి లంచం అడుగుతున్నది నిజమేనని ధృవీకరించుకొని వారుఉద్యోగికి ఇమ్మని 10 వేల రూపాయలు ఇచ్చారు. వారు ఇచ్చిన ఆ మొత్తాన్ని మంగళవారం సబ్ ట్రెజరీ కార్యాలయంలోరాహుల్ నుంచి మల్లేశం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనితో పాటు కార్యాలయ రైటర్ హరీష్ కుమార్ కూడా పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య, సీఐ లు వేణు గోపాల్, రాము, సంజీవ్ పాల్గొన్నారు.
చిత్రం... ఏసీబీ వలలో చిక్కిన సబ్ ట్రెజరీ సిబ్బంది మల్లేశం, హరీష్ కుమార్