క్రైమ్/లీగల్

మాయలేడి నిలువుదోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 4: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ మాయలేడి చూపుల వలలో చిక్కిన ఓ వ్యక్తిని తన అనుచరులతో కలిసి నిలువు దోపిడీ చేసేసింది. ఒంటిపైన బట్టలు తప్ప మరేమి మిగలని ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెడితే కడప జిల్లా రాయచోటికి చెందిన రవి శ్రీవారి దర్శనార్థం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో అతని పక్కనే ఉన్న ఓ మహిళను చూసి సర్వం మరచిపోయాడు. ఆమె కను సైగలతో ఏమి ఆలోచించకుండా వెంట నడిచాడు. ఏకాంత ప్రదేశంలో చేరగానే ఆమె పక్కనే హఠాత్తుగా ప్రత్యక్షమైన ముగ్గురు వ్యక్తులు తమదైన శైలిలలో అతనిని దోచేశారు. రవి వద్ద ఉన్న రూ. 18వేలు నగదు, స్మార్ట్ఫోన్, వాచ్, క్రెడిట్ కార్డులు, దుస్తులున్న బ్యాగ్‌ను తీసుకుని ఉడాయించారు. ఆ మాయలేడి సైతం కనిపించకుండా పోవడంతో స్పృహలోకి వచ్చిన రవి ఒక్కసారిగా గొల్లుమన్నాడు. అతని పరిస్థితిని చూసిన ఆర్టీసీ సిబ్బంది సలహాతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆర్టీసీ బస్టాండ్‌లోని సీసీ టివి ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. కాగా ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ తప్పు బయటపడితే పరువు పోతుందన్న భయంతో కొందరు ఎవరికీ ఫిర్యాదు చేయకుండా వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది.