క్రైమ్/లీగల్

నిర్మోహి అఖారాకు ఆ హక్కు ఉందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : వివాదాస్పద రామజన్మభూమి బాబ్రీ మసీదు కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు బుధవారం నిర్మోహి అఖారా హక్కులపై వివరణను కోరింది. వివాదాస్పద రామజన్మభూమి బాబ్రీ మసీదు ఆవరణ నిర్మోహి అఖారా ఆధీనంలోనే ఉంది. దీనిని రామ్‌లల్లాకు ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించింది. అయితే, ఇది వివాదాస్పద ప్రాంతం కావడంతో దానిపై నిర్మోహి అఖారాకు హక్కులు ఉన్నాయా? లేవా? అనే అంశంపై అభిప్రాయం వ్యక్తం చేయాలని ఈ కేసులో వాదులుగా ఉన్న ముస్లిం మత వర్గాలను సుప్రీంకోర్టు సూచించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ బెంచ్ ఈ కేసును విచారిస్తోంది. ప్రతివాదులుగా ఉన్న సున్నీ వక్ఫ్ బోర్డు, తొలుత వివాదాస్పద స్థలంపై కేసు వేసిన సిద్దిఖీ ఇటీవల ఒక ప్రకటన చేస్తూ నిర్మోహి అఖారాకు మాత్రమే రామజన్మభూమిలో పూజాది కార్యక్రమాలు నిర్వహించే హక్కు ఉన్నట్టు తెలిపింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలను సంధించింది. అఖారాకు ఉన్న హక్కులను అంగీకరిస్తున్నారా? లేదా అన్నది స్పష్టం చేయాలని ముస్లిం మత వర్గాలను కోరింది.