క్రైమ్/లీగల్

ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్‌లో మరో 80 కేసులు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 4: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో వాహన తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ట్రాఫిక్ అధికారులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా బుధవారం నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులపై ట్రాఫిక్ అధికారులు 80 కేసులు నమోదు చేశారు. పట్టుబడిన 32మందికి ట్రాఫిక్ చట్టాల పట్ల కౌనె్సలింగ్ నిర్వహించారు. పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఆదేశాలతో గత వారం రోజులుగా నగరంలో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. నగరంలోని ముఖ్య కూడళ్లలో తనిఖీలు చేపట్టిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులను నిలిపి కేసులు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్, స్నేక్, జిగ్‌జాగ్ డ్రైవింగ్, అతివేగం, ప్రమాదకర డ్రైవింగ్, త్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, అపోజిట్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, నో హెల్మెట్ డ్రైవింగ్ తదితర నిబంధనలు ఉల్లంఘించిన 32మందిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం 80 కేసులు నమోదు చేయడంతోపాటు రూ.61వేల రూపాయలు జరిమానా విధించి ఆయా వాహనాలు సీజ్ చేశారు. వీరందరికీ బందరురోడ్డులోని కేఎస్ వ్యాస్ కాంప్లెక్స్‌లో కౌనె్సలింగ్ నిర్వహించిన మీదట ట్రాఫిక్ చట్టాల గూర్చి వివరించారు. ఈసందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ వైబీడీ అంకినీడు ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించి, సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్, వాహనాలకు ఉండాల్సిన అన్ని రికార్డులను కలిగి ఉండాలని, వాహనాలను నడిపేటప్పుడు విధిగా మోటారు వాహనాల చట్టాల ప్రకారం నియమాలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించి వారికి వారు హాని చేసుకోవడమే కాకుండా, ఇతర వాహన చోదకులకు, ప్రజలకు హాని కలుగుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కానీ, వృత్తి, వ్యాపారాలు నిర్వహించుకునేవారుగాని, చదువుకునే విద్యార్థులుగాని బయటకు వెళితే వారి కోసం వారి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారని, రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతే ఆసరాగా ఉంటారని కోరుకునే కుటుంబ సభ్యులు పడే బాధను ఒక్క క్షణం ఆలోచించాలన్నారు. నిబంధనలు పాటించకుంటే చట్టపరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపకుండా వారి తల్లిదండ్రులే జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ సురేష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.