క్రైమ్/లీగల్

పెడనలో జామియా మసీదు వక్ఫ్ బోర్డు భూమి వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన, సెప్టెంబర్ 4: పట్టణంలోని జామియా మసీదుకు సంబంధించిన వక్ఫ్ బోర్డు భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేయాలని టీడీపీకి చెందిన మైనార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారంటూ స్థానిక ముస్లిం నాయకులు పెడన పోలీసు స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. టీడీపీ మైనార్టీ నాయకుడు అబ్దుల్ రషీద్, మొహమూద్‌లపై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి బుధవారం ఉదయం ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. జామియా మసీదు కమిటీ సభ్యులు ఈ సమస్యపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. మసీదుకు సంబంధించిన కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని పరిరక్షించాలని వారు కోరారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వక్ఫ్‌బోర్డు జిల్లా టాస్క్ఫోర్స్ అధికారి అబ్దుల్ ఖుద్దూస్ తెలిపారు. ఈ సమస్యపై ఉప ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, వక్ఫ్‌బోర్డు జిల్లా అధికారులతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వక్ఫ్‌బోర్డు రాష్ట్ర పీఓ సయ్యద్ తదితరులు వివాదాస్పద భూమిని పరిశీలించారు. అందుకు సంబంధించిన పత్రాలను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు.