క్రైమ్/లీగల్

మహిళపై అత్యాచార యత్నం, దాడి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్, సెప్టెంబర్ 4: బాపులపాడు మండలం రెమల్లెలోని మోహన్ స్పిన్ టెక్ కర్మాగారంలో పనిచేస్తున్న ఓ మహిళపై అక్కడే పనిచేస్తున్న కార్మికుడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడనే వదంతులు వ్యాపించాయి. కార్మికుడి దాడిలో గాయపడిన మహిళను పోలీసులు ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. వీరవల్లి ఎస్.ఐ చంటిబాబు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మల్లవల్లికి చెందిన ఓ మహిళ మోహన్ స్పిన్‌టెక్ మిల్లులో రోజువారీ కూలిగా పనిచేస్తోంది. కర్మాగార విస్తరణ పనుల నిమిత్తం బెంగాల్ నుంచి వచ్చిన మరో కార్మికుడు టాయిలెట్ వెళ్తున్న కార్మికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సమయంలో ఆమె గట్టిగా అరవడంతో భయపడిన కార్మికుడు మహిళ మొహంపై రాయితో దాడి చేశాడు. దీంతో ఆమెకు గాయమైంది. దంతాలు దెబ్బతిన్నాయి. యాజమాన్యం ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తోటి కార్మికుల నుంచి వివరాలు సేకరించి మహిళను అసుపత్రికి తరలించారు. మహిళ ఫిర్యాదు మేరకు కార్మికుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చంటిబాబు తెలిపారు.