క్రైమ్/లీగల్

ఢిల్లీ కోర్టుకు డీకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : మనీ లాండరింగ్ కేసును ఎదుర్కొంటున్న కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఢిల్లీ కోర్టు ముందు హాజరుపరిచింది. మంగళవారం రాత్రి ఆయనను అరెస్టు చేసిన ఈడీ బుధవారం ఉదయం ఢిల్లీ కోర్టులో న్యాయమూర్తి అజయ్ కుమార్ ముందు ప్రవేశపెట్టింది. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు జరిపిన తర్వాత ఈడీ అధికారులు ఆయనను కోర్టుకు తీసుకువచ్చారు. మనీ లాండరింగ్‌తోపాటు పలు ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 57 ఏళ్ల డీకే కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు మూడుసార్లు ఈడీ ముందు విచారణ నిమిత్తం హాజరైన డీకే మంగళవారం కూడా విచారణకు వచ్చారు.
అయితే, డీకేను ప్రశ్నించిన వెంటనే తమ ప్రధాన కార్యాలయంలో ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం కొన్ని గంటల పాటు ఈడీ విచారణ కొనసాగినట్టు సమాచారం. గత ఏడాది సెప్టెంబర్‌లో డీకేతోపాటు న్యూఢిల్లీలోని కర్నాటక భవన్‌లో పనిచేస్తున్న హనుమంతయ్యపైన కూడా ఈడీ కేసులు పెట్టింది. ఈ కేసుల నేపథ్యంలోనే గత వారం కర్నాటక హైకోర్టుకు డీకే హాజరయ్యారు. తన అరెస్టుకు ఈడీ జారీ చేసిన సమన్లను ఆయన సవాల్ చేశారు. కాగా, అదే సమయంలో ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ మరోకేసు కూడా డీకేపై నమోదు చేసి ఢిల్లీ హైకోర్టులో హాజరుపరిచింది. హవాలా మార్గంలో భారీ ఎత్తున కుంభకోణానికి డీకే పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తోంది.

14 రోజుల కస్టడీ..
న్యూఢిల్లీ: హవాలా మార్గంలో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలను ఎదుర్కొంటున్న డీకే శివకుమార్‌ను విచారించి, పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీలుగా ఆయనను 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ హైకోర్టును ఈడీ కోరింది. ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని ఈడీ తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్, న్యాయవాది ఎన్‌కే మట్టా తెలిపారు. ఆయనను మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని వారు కోర్టుకు నివేదించారు. కనీసం రెండు వారాల పాటు తమ కస్టడీలో ఉంటే, మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించగలుగుతామని ఈడీ తరఫున వారు కోర్టుకు తెలిపారు. అయితే, డీకే తరఫున వాదిస్తున్న అభిషేక్ మను సింఘ్వీ, దయాన్ కృష్ణన్ తమ క్లయింట్‌ను వెంటనే విడిచిపెట్టాలని, ఈడీ కస్టడీకి ఇవ్వవద్దని కోరారు. ఆయన నిర్దోషి అని, విచారణకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారని వారు తెలిపారు. అలాంటి వ్యక్తిని ఈడీ కస్టడీకి పంపడంలో అర్థం ఉండదని వారు వ్యాఖ్యానించారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత కేసును కోర్టు గురువారానికి వాయిదా వేసింది.
చిత్రం... కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌