క్రైమ్/లీగల్

సవాలు పిటిషన్‌ను ఉపసంహరించుకున్న మిశ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: అనర్హత వేటు పడిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే కపిల్ మిశ్రా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద తనపై వేటు వేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం ఉపసంహరించుకున్నారు. కపిల్ మిశ్రా ఇటీవల ఆప్‌ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. మిశ్రా తన సవాలు పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అతని తరపు న్యాయవాది అశ్వని కుమార్ దూబే చేసిన విజ్ఞప్తికి హైకోర్టు న్యాయమూర్తి నవీన్ చావ్లా ధర్మాసనం అంగీకరించింది.
అనంతరం మిశ్రా కోర్టు వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ ‘నేను భారతీయ జనతా పార్టీలో చేరాను. అవినీతి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే నా ఏకైక లక్ష్యం’ అని అన్నారు. కరవాల్‌నగర్ ఎమ్మెల్యే అయిన మిశ్రాను బీజేపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నందుకు స్పీకర్ అనర్హుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. జనవరి 27వ తేదీ నుంచి అనర్హత అమలులోకి వచ్చింది. తాను ఆగస్టు 17న బీజేపీలో చేరానని, అయితే అంతకన్నా ముందే ఆగస్టు 8వ తేదీనే స్పీకర్ తనను అనర్హుడిగా ప్రకటించారని మిశ్రా తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో మిశ్రా బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అనుకూలంగా ప్రచారం చేశారని, అంటే ఆయన తన స్వంత రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్టు కనపడుతోందని, అందువల్ల ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అతడిపై చర్య తీసుకోవడం జరిగిందని స్పీకర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వంటి ఆప్ నాయకులు కూడా కాంగ్రెస్, ఎస్‌పీ వంటి ప్రత్యర్థి పార్టీలతో వేదికను పంచుకున్నారని మిశ్రా తన అఫిడవిట్‌లో వాదించారు. సభ్యులకు వేరే ప్రమాణాలు పాటించజాలరని ఆయన పేర్కొన్నారు.