క్రైమ్/లీగల్

జడ్జి గారికి కోపమొచ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కతిహార్ (బిహార్) : బిహార్‌లోని కతిహార్ జిల్లా, సెషన్స్ జడ్జికి కోపమొచ్చింది. కోర్టుకు వెళ్లే తరుణంలో సదరు వాహనం ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో జడ్జి సహనాన్ని కోల్పోయారు. అంతే సెక్యూరిటీ సిబ్బందిలోని ఒక పోలీసుపై తన అసహనాన్ని ప్రదర్శిస్తూ బట్టలు విప్పించి మరీ చితకబాదినట్లు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడు ఫిర్యాదు లో పేర్కొన్న వివరాలు మేరకు.. జిల్లా, సెషన్స్ జడ్జి ప్రదీప్‌కుమార్ మాలిక్ బుధవారం ఇంటి నుంచి కోర్టుకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో సహనాన్ని కోల్పోయిన ఆ జడ్జి తన భద్రతా సిబ్బందిలో ఒకరైన పోలీసు హర్వీష్‌కుమార్‌ను బట్టలు విప్పి కోర్టుకు వెళ్లేంతవరకు చితకబాదారు. ఇంకేమి ప్రమాదం ఉం టుందోనని భయపడ్డ బాధితుడు కలెక్టరేట్ వద్ద వాహనం దిగి జిల్లా ఎస్పీ కార్యాలయానికి నేరు గా వెళ్లాడు. సంఘటనపై పోలీసు సిబ్బంది ది గ్భ్రాంతికి గురయ్యారు. ఎస్పీకి వివరాలు చెప్ప గా సంబంధిత స్టేషన్‌లో ఫిర్యాదు చేయమని సలహా నివ్వడంతో సహాయక్ పోలీస్ స్టేషన్‌లో జడ్జి తనపై సాగించిన దాష్టీకాన్ని పూసగుచ్చిన ట్లు వివరించాడు. కొట్టడమే కాకుండా తీవ్ర పదజాలంతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కానిస్టేబుల్ ఫిర్యాదు ఇచ్చిన కొద్దిసేపటికే జ్యుడీషియల్ అధికారులు సైతం స్టేషన్‌కు వచ్చి కానిస్టేబుల్ హర్వీష్ కుమార్ జడ్జి దగ్గరకు అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేశారు. ఆ మేరకు హర్వీష్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదులపై అత్యున్నతస్థాయి విచారణ నిర్వహించి చట్టరీత్యా చర్యలు తీసుకొంటామని ఎస్‌హెచ్‌వో రాకేష్‌కుమార్ వెల్లడించారు.