క్రైమ్/లీగల్

తీహర్ జైలుకు చిదంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ. చిదంబరాన్ని 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ తీహార్ జైలుకు పంపారు. ఈనెల 19 వరకు ఆయన్ను తీహార్ జైల్లో ఉంచాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అజయ్‌కుమార్ కుహర్ గురువారం తీర్పునిచ్చారు. నిందితుడిపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని.. అందుకే ఆయన్ను పోలీసు కస్టడీకి పంపినట్లు న్యాయమూర్తి వెల్లడించారు. ఇప్పటికీ కూడా ఈ ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు. చిదంబరానికి బెయిల్ ఇస్తే ఆయన తన పలుకుబడి ఉపయోగించుకొని దర్యాప్తును తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని సీబీఐ గట్టిగా వాదించింది. ఈ కేసు చాలా సంక్లిష్టమైందని.. నిందితుడిని విచారణ సమయంలోనే బెయిల్‌పై విడుదల చేయడానికి ఎంతమాత్రం వీలులేదని న్యాయమూర్తి తెలిపారు. అన్ని వాస్తవాలు, పరిస్థితులను అలాగే, కేసు స్వభావాన్ని దర్యాప్తు స్థితిగతులను లోతుగా పరిశీలించిన మీదటే చిదంబరాన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని నిర్ణయించినట్లు న్యాయమూర్తి తెలిపారు. ప్రస్తుతం జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్న చిదంబరాన్ని తీహార్ జైల్లో విడిగా సెల్‌లో ఉంచాలని, అలాగే, మందులను, కళ్లజోడును తీసుకెళ్లడానికి అనుమతించాలని కోర్టు స్పష్టం చేసింది. తీహార్ జైల్లో చిదంబరానికి పూర్తి భద్రత కల్పిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు. 73 సంవత్సరాల చిదంబరాన్ని రెండు రోజుల సీబీఐ కస్టడీ పూర్తి కావడంతో గురువారం ఢిల్లీ కోర్టులో హాజరు పరిచారు. చిదంబరాన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలన్న సీబీఐ వాదనను ఆయన తరఫు వాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ కస్టడీకి వెళ్లేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని న్యాయవాది తెలిపారు. కాగా, మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎయిర్‌సెల్, మాక్సిస్ కేసుల్లో చిదంబరం, ఆయన కుమారుడు కార్తీక్‌కు మరో ప్రత్యేక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, చిదంబరం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తున్నారు. చిదంబరం లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని, ఈడీ కస్టడీకి వెళ్లేందుకు సంసిద్ధమైనప్పుడు ఆయన్ను తీహార్ జైలుకు పంపాల్సిన అవసరం ఏమిటని సిబల్ వాదించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేటే ఆయన్ను తన కస్టడీలోకి తీసుకోవాలని అన్నారు. ఇంతవరకు చిదంబరానికి వ్యతిరేకంగా రుజువులు ఏవీ లేవని, చార్జిషీటు కూడా దాఖలు కాలేదని చెప్పారు. ఈ వాదనను తుషార్ మెహతా తిరస్కరించారు. విదేశాల్లో ఉన్న బ్యాంకులను సైతం చిదంబరం ప్రభావితం చేస్తున్నారని.. దర్యాప్తులో సహకరించడం లేదని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఈ బ్యాంకులను చిదంబరం ప్రభావితం చేస్తే దర్యాప్తులో అవి సహకరించే అవకాశం ఉండదని ఆయన అన్నారు.

చిత్రం... కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ. చిదంబరం