క్రైమ్/లీగల్

ఆ కేసును పరిశీలిస్తాం అయోధ్య కేసు ప్రత్యక్ష ప్రసారంపై సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: వివాదాస్పద రామజన్మభూమి, బాబ్రీ మసీదు కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిందిగా దాఖలైన పిటిషన్‌ను త్వరలోనే పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అయోధ్య కేసును ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అధ్యక్షతన న్యాయమూర్తులు జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, సూర్యకాంత్ సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు బెంచ్ రోజువారి విచారణను చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త కేఎన్ గోవిందాచార్య ఓ పిటిషన్ వేశారు. అయోధ్య కేసు చాలా సున్నితమైనదని, అత్యంత ప్రాముఖ్యత కలిగినదని గోవిందాచార్య తరఫున హాజరైన న్యాయవాది వికాస్ సింగ్ కోర్టుకు తెలిపారు. ఈ కేసు కోట్లాదిమంది భారతీయుల మనోభావాలతో ముడిపడి ఉన్నందున ప్రత్యక్ష ప్రసారం అంశాన్ని పరిశీలించాలని ఆయన కోరారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే కేవలం ఆడియో ప్రసారాన్ని చేయాలని ఆయన కోరారు. గోవిందాచార్య చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందిస్తూ ఇలాంటి అంశాల్లో సత్వరమే విచారణ గానీ నిర్ణయాలు గానీ సాధ్యం కావని స్పష్టం చేసింది. ఇది సున్నితమైన అంశమే కాకుండా రాజ్యాంగానికి సంబంధించిన విషయం కూడా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే, గోవిందాచార్య పిటిషన్‌ను పరిశీలిస్తామని తెలిపింది.